అన్నపూర్ణ(అనంతగిరి) రిజార్వాయర్ నుండి నీటి విడుదలWater release from Annapurna (Anantagiri) Reservoir

అన్నపూర్ణ(అనంతగిరి) రిజార్వాయర్ నుండి నీటి విడుదల


•నీటిని విడుదల చేయించిన  ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

ఇల్లంతకుంట మండలం అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని వెంటనే విడుదల చేయాలని డాక్టర్ ఎమ్మెల్యే, ఆరోగ్య ప్రదాత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. 

సోమారంపేట గ్రామానికి చెందిన రైతులు, మాజీ ఎంపీపీ  వుట్కూరి వెంకటరమణారెడ్డి  దగ్గరికి వెళ్లి పంట పొలాలకు నీరు అందించాలని కోరగా, వెంటనే మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  తో మాట్లాడి రైతుల కు నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేశారు .నీటిని విడుదల చేయించిన  ఎమ్మెల్యే కి,  మాజీ ఎంపీపీ రమణారెడ్డి కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment